Breaking News

రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..

Published on Thu, 05/14/2026 - 10:16

ఇటీల ఆరోగ్య స్పృహతో గ్రీన్‌టీ వంటివి తీసుకుంటున్నారు. అందులోనూ వర్కౌట్లు, డైట్‌లు పాటించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి రోజు గ్రీన్‌టీ తోనే మొదలవుతుంది. అయితే ఇలా గ్రీన్‌టీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ సోషల్‌ మీడియా వేదికగా దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా వివరించారు. మరి అవేంటో చూద్దామా.!

గ్రీన్‌ టీ తాగడం అనేది ఒక సాధారణ ఆరోగ్యకరమైన విధానంగా పేర్కొనవచ్చు. దీనిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండిన గ్రీన్‌ టీతో మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి గ్రీన్‌టీని క్రమంతప్పకుండా తీసుకుంటే.. జీవక్రియ, మెదడు పనితీరు, కాలేయ ఆరోగ్యం తదితరాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. 

కేవలం 14 రోజుల్లోనే..గొప్ప మార్పులు..
కేవం 14 రోజుల్లోనే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరంలో అర్థవంతమైన మార్పులు ఎలా సంతరించుకుంటాయో  గమనించొచ్చని అన్నారు. అంతేగాదు హర్వర్డ్‌ అండ్‌ స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ 14 రోజుల పాటు ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఇలా జరుగుతుందంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆయన ఈ వీడియోకి ఇది ఆరోగ్యకరమైన అలవాటా? లేక అతిగా ప్రచారం చేయబడిన ట్రెండా? అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు.

కలిగే ప్రయోజనాలు..
ఆ వీడియోలో గ్రీన్ టీ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే మొదటి అవయవాలలో కాలేయం ఒకటని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ టీలో EGCG వంటి కాటెచిన్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించి, జీవక్రియను మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేగాదు యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటం ద్వారా పనిచేస్తాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ వల్ల వచ్చే త్రీమైన వణుకుని నివారించి ఏకాగ్రత శక్తిని పెంచుతుందట. అంతేగాదు మెదడు చురుకుగా ఉంటుందని చెబుతున్నారు

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..)

 

Videos

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు

బండి భగీరథ్ కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన కామెంట్స్

హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్

Photos

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)