Breaking News

కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్‌ టిప్స్‌

Published on Wed, 05/13/2026 - 15:09

కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్‌. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్‌ నటి రాజశ్రీ దేశ్‌పాండే. తాను కేన్సర్‌తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.

'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటి రాజవ్రీ దేశ్‌పాండ్‌కు మార్చిలో గ్రేడ్‌1 రొమ్ము కేన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటున్నారామె.

పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..
ఈ కేన్సర్‌ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. 

మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్‌కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. 

ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..
ఈ కేన్సర్‌ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్‌ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. 

తన ఫ్యామిలీ డాక్టర్‌ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్‌పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్‌ మ్యాన్‌ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. 

(చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్‌' కాదు 'పీఎంఓఎస్‌')


 

 

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)