Breaking News

బ్లేజర్‌ జస్ట్‌ రూ. 65 వేలు..కానీ హ్యాండ్‌ బ్యాగ్‌ మాత్రం అన్ని లక్షలా..!

Published on Tue, 05/12/2026 - 13:32

79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్‌ నటి తారా సుతారియా. తన స్టైలిష్‌ లుక్‌తో ఆ వెంట్‌లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్‌ ఇచ్చేసిందామె. ఎయిర్‌పోర్ట్‌ నుంచే పవర్‌ డ్రెస్సింగ్‌ అవుట్‌ఫిట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్‌ ఫ్యాషన్‌ని ఎలా నిశబ్దంగా సింపుల్‌గా ప్రదర్శించాలో తన లుక్‌తో అద్భుతంగా చూపించారామె. 

తారా సుతారియా ఎయిర్‌పోర్ట్‌లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్‌లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్‌ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్‌గా అదే బ్రాండ్‌కు చెందిన బ్యాగీ ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్‌తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789. 

బటన్ క్లోజర్‌తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్‌ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్‌ డ్రెస్‌కి అనుగుణంగా నలుపు రంగు జిల్‌ లెదర్‌ హైహిల్స్‌ని ధరించింది తారా. తన లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్‌ బ్యాగ్‌ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది. 

ఈ బ్యాగ్‌కు తీసివేయగల చైన్‌ షోల్డర్‌ స్ట్రాప్‌, లోపల జిప్‌ పాకెట్‌ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్‌గ్లాసెస్‌ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్‌ ఆ గాగుల్స్‌ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట.  ఈ బ్యూటీ తన లగ్జరీయస్‌ అవుట్‌ఫిట్‌ లుక్‌తో ఈ కేన్స్‌ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్‌ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!. 

 

(చదవండి: గోల్డ్‌ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్‌ స్టన్నింగ్‌ లుక్‌!)
 

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)