సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!
Breaking News
యువ జంట ఘనత.. జస్ట్ 10 గంటల్లో..
Published on Thu, 05/07/2026 - 16:59
బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్‌కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే.
బెంగుళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు.
మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆ రేంజ్‌లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!)
Tags : 1