Breaking News

గడ్కరీ కీలక ప్రకటన.. టోల్ ప్లాజాలు మాయం!

Published on Thu, 05/07/2026 - 15:16

జాతీయ రహదారులపై వాహనాలు వేచి ఉండే సమయాన్ని, రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పడికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో కూడా వాహనాలు టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. తద్వారా రోడ్డుపై కొంత ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిని కూడా నివారించడానికి ప్రభుత్వం ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టం తీసుకొస్తోంది.

హైవేలపై రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. భారతదేశంలో త్వరలోనే టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టైమ్స్ డ్రైవ్ ఆటో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 చివరి నాటికి భారత రహదారులపై టోల్ ప్లాజాలను తొలగించే అవకాశం ఉంది.

అయితే.. 2026 చివరి నాటికి ఎంఎల్ఎఫ్ఎఫ్ (మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో) అనే కొత్త టోల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని గడ్కరీ తెలిపారు. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రహదారిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాంట్రీలు, కెమెరాలు, సెన్సార్లు, ఫాస్ట్‌ట్యాగ్ రీడర్లు వాహనాలను గుర్తించి.. టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డిజిటల్ పద్ధతిలో వసూలు చేస్తాయి.

ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద ఉండే భారీ క్యూలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. వాహనాలు ఆగకుండా ప్రయాణించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గి, హైవే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలు హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు అంతగా అనుకూలంగా లేవని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. చాలాసార్లు టోల్ చెల్లింపుల విషయంలో వాదనలు, సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటెడ్, బ్యారియర్‌లెస్ టోల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ కొత్త విధానములో కూడా ఫాస్ట్‌ట్యాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాహనంలో సరైన ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే లేదా బ్యాలెన్స్ తక్కువగా ఉంటే వాహన యజమానికి యధావిధిగా ఈ-నోటీసులు అందుతాయి. నిర్ణీత సమయంలో టోల్ చెల్లించకపోతే రెట్టింపు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రతి వాహనదారుడు తన ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)