VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
Breaking News
నిర్మాత ఆర్బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు
Published on Wed, 05/06/2026 - 19:50
ప్రముఖ నిర్మాత అధినేత ఆర్బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.
కాగా... ఆర్బీ చౌదరితో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
தயாரிப்பாளர் ஆர். பி. சௌத்ரி உடலுக்கு தலைவர் விஜய் நேரில் அஞ்சலி! pic.twitter.com/GmhMrE5ByT
— Tamilaga Vettri Kazhagam (@TVKFor_TN) May 6, 2026
Tags : 1