TVK విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
Breaking News
అల్లు అర్జున్ ఇంటికి పిలిచి తిట్టాడు : నందినిరెడ్డి
Published on Wed, 05/06/2026 - 13:12
తనదైన శైలీలో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దర్శకురాలు నందిని రెడ్డి. తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది అవార్డుని సైతం గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా.. ఓ బేబీ మూవీతో మళ్లీ భారీ విజయాన్ని అందుకుంది. అందులో ప్రధాన పాత్రలో నటించిన సమంతతో ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. నందినిరెడ్డికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఆమెను ఘోరంగా తిట్టాడని ఆ వార్త సారంశం. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నందిని రెడ్డే చెప్పింది. బన్నీ ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలేం జరిగింది?
సినిమా ఫ్లాప్
నందినిరెడ్డి దర్శకురాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించింది. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి… రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘జబర్దస్త్’ అనే మూవీతో ప్రేక్షుకల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై..బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నందిని రెడ్డి కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకే రాలేదట. దాదాపు మూడు నెలల వరకు ఇంట్లోనే ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో నందిని చెప్పింది.
బన్నీ తిట్టాడు..
అయితే ఈ విషయం తెలిసి అల్లు అర్జున ఆమెని తిట్టాడట. ‘ఓ రోజు అల్లు అర్జున్ ఇంటికి రమ్మని కబురు పంపాడు. నేను ఇంటికి వెళ్లగానే ఘోరంగా తిట్టాడు. ‘ఇచ్చింది ఒకటే ఫ్లాప్ ..దాని కోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటారా? నెక్ట్స్ సినిమా ప్లాన్ ఏంటి? కథేంటి? అని అడిగితే.. నేను బిత్తరపోయా. అసలు స్టోరీ ఏదైనా రాశావా లేదా అని అడిగాడు. రాశానని చెప్పా. వెళ్లి తీసుకొని రా. వన్లైన ఆర్డర్ తీసుకురా. నాకు నెరేషన్ ఇవ్వు. నా ఓపీనియన్ చెబుతా’ అని అలా ఎంగరేజ్ చేశాడు. బన్నీ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ ఎంగరేజ్ చేస్తుంటాడు’ అని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.
Tags : 1