Breaking News

ఆర్‌బీ చౌదరి మృతిపై విశాల్ దిగ్భ్రాంతి

Published on Tue, 05/05/2026 - 23:27

ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు.  

విశాల్ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని విశాల్‌ తన సంతాపాన్ని ప్రకటించారు.

ఆర్‌బీ చౌదరి స్థాపించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు నిర్మించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతి భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

Videos

ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..

ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!

సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్

హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు

TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం

విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?

ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK

విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!

ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం

Photos

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి (ఫొటోలు)

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)