Breaking News

'ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా..' మెగాస్టార్

Published on Tue, 05/05/2026 - 20:47

ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ఈ ఆకస్మిక, విషాదకరమైన  సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. గాడ్‌ ఫాదర్ మూవీ కోసం ఆర్‌బీ చౌదరితో కలిసి పనిచేశానని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

ఆయన ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్దారని మెగాస్టార్ కొనియాడారు. ఒక నిర్మాతగా ఆయన లెక్కలేనన్ని కథలకు జీవం పోశారని తెలిపారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నట్లు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. 

సినీ ప్రముఖుల సంతాపం...

ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్, విశాల్ తమ సంతాపం వ్యక్తం చేశారు.  కాగా.. ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో చిత్రాలు నిర్మించారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం, నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించారు.  
 

 

 

 

Videos

ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..

ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!

సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్

హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు

TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం

విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?

ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK

విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!

ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం

Photos

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి (ఫొటోలు)

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)