Breaking News

స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?

Published on Tue, 05/05/2026 - 14:49

ప్రపంచవ్యాప్తంగా టెక్ విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించనుందనే వార్తలొస్తున్నాయి. యాపిల్‌, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ తన సరికొత్త ఏఐ ఏజెంట్ ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం యాప్‌ల మీద ఆధారపడకుండా కృత్రిమ మేధ ద్వారా నేరుగా పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ అంశాలను అధికారికంగా కంపెనీ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఏమిటీ ఏఐ ఏజెంట్ ఫోన్?

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ల్లో మనం ఒక పని కోసం వివిధ యాప్‌లను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేస్తున్న ఈ ఏజెంట్ ఫోన్ ఆ పద్ధతినే మార్చేయనుంది. ఇందులో యూజర్లు పనులను పూర్తి చేయడానికి ఏజెంట్ పైన ఆధారపడతారు. అంటే, ఫోన్‌లోని ఏఐ యూజర్ తరఫున వివిధ యాప్‌ల మధ్య నావిగేట్ చేస్తూ పనిని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మొబైల్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చనుంది.

లీక్ అయిన స్పెసిఫికేషన్స్‌

ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కుయో వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఈ స్మార్ట్‌ఫోన్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. అందుకోసం మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది డైమెన్సిటీ 9600 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. టీఎస్‌ఎంసీ అధునాతన N2P (2nm) నోడ్ సాంకేతికతతో ఈ చిప్ తయారవుతుంది. ఇందులో డ్యూయల్-ఎన్‌పీయూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ఏఐ గణనలను వేగంగా పూర్తి చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం ఎల్‌పీ డీడీఆర్‌6 ర్యామ్‌ యూఎఫ్‌ఎస్‌ 5.0 స్టోరేజ్ సాంకేతికతను వాడుతున్నారు. ఇన్-లైన్ హ్యాషింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి’ అన్నారు.

ఎందుకు ఈ ఫోన్ అవసరం?

ఓపెన్‌ఏఐ ఈ ఫోన్‌ను తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వ్యాపార వ్యూహం. రాబోయే కాలంలో కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి బలమైన ప్రొడక్ట్ స్టోరీ అవసరం. రెండు.. మార్కెట్ ఆధిపత్యం. యాపిల్, గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు ఏఐ ఫీచర్లను తమ ఫోన్లలో వేగంగా ప్రవేశపెడుతున్నాయి. ఈ పోటీలో వెనుకబడకుండా ఉండాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిపై నియంత్రణ ఉండాలని ఓపెన్‌ఏఐ భావిస్తోంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ 2027 మొదటి అర్ధభాగంలో భారీ ఉత్పత్తి దశలోకి వెళ్లనుంది. 2027-2028 మధ్య సుమారు 30 మిలియన్ల యూనిట్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఓపెన్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు లేదా సామ్ ఆల్ట్‌మాన్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏదేమైనా ఒక సాఫ్ట్‌వేర్ దిగ్గజం సొంత హార్డ్‌వేర్‌తో వస్తుందంటే అది మొబైల్ పరిశ్రమలో పెను సంచలనమే కానుంది. టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏఐ ఏజెంట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ వినియోగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందో లేదో చూడాలి.

ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

Videos

ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..

ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!

సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్

హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు

TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం

విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?

ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK

విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!

ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం

Photos

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి (ఫొటోలు)

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)