Breaking News

ఏఐపై జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 05/04/2026 - 13:39

నేడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. రోజుకో కొత్త సాంకేతికత, శక్తివంతమైన ఏజెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఎంత మేధస్సును కలిగి ఉన్నా సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి.

మెటా సంస్థ 2026 మొదటి త్రైమాసిక పలితాల విశ్లేషణ సమావేశంలో మాట్లాడుతూ, జుకర్ బర్గ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఏఐ ఏజెంట్లు అత్యంత శక్తివంతమైనవి కావొచ్చు, కానీ అవి సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘మదర్ టెస్ట్’గా అభివర్ణించారు.

‘నా తల్లి సైతం అర్థం చేసుకునేంత సరళంగా ఈ ఏజెంట్లు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిలో మెజారిటీ సాధనాలు ఆ మదర్‌ టెస్ట్‌లో విఫలమవుతున్నాయి’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నిపుణులు, కోడింగ్ తెలిసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతున్నారు తప్ప, సాధారణ వినియోగదారులకు ఇవి భారంగా మారాయని ఆయన విశ్లేషించారు.

మెటా వ్యూహం

ప్రస్తుతం ఓపెన్ సోర్స్, కోడింగ్ ఆధారిత ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీలో ఉన్నాయి. అయితే, మెటా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. వేగం కంటే వినియోగ సౌలభ్యానికి తమ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, కమాండ్-లైన్ సెటప్‌లు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ఏఐ ఏజెంట్లు చేరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వినియోగదారులు ఎటువంటి అదనపు శిక్షణ లేకుండా అత్యంత సహజంగా ఉపయోగించగల సాధనాలను రూపొందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్‌ చెప్పారు.

పెట్టుబడుల వెనుక ఆంతర్యం

పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మెటా తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతున్నా దీర్ఘకాలికంగా మార్కెట్‌ను శాసించేది వినియోగదారులకు అత్యంత చేరువలో ఉండే ఏఐ సాధనాలేనని మెటా భావిస్తోంది. ‘సాంకేతిక పురోగతి మాత్రమే ముఖ్యం కాదు. అది మనిషి జీవితంలో ఎంత సులభంగా భాగమైందనేదే అసలైన విజయానికి కొలమానం’ అని జుకర్ బర్గ్ గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

Videos

దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK

LIVE : విజయ్ గెలుపు జగన్ రియాక్షన్

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)