Breaking News

నేను క్లాస్ తను మాస్!

Published on Sun, 05/03/2026 - 00:22

రహస్య గోరఖ్‌ నటనతోనే కాదు, తన నిజాయితీ మాటలతో కూడా అందరినీ ఆకట్టుకునే తెలుగింటి అమ్మాయి. జీవిత భాగస్వామిగా కిరణ్‌ అబ్బవరంను ఎంచుకున్న 
ఈ సుందరి, తన మనసులోని భావాలను మనతో పంచుకుంది. ఆ విషయాలే మీకోసం..

నాది సినిమా ప్రేమకథ
నా అసలు పేరు ఐశ్వర్య గోరఖ్‌. సినిమా ప్రపంచమే నాకు రహస్య అనే పేరు పెట్టింది. అదే ప్రపంచం నా మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’తో జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. మా ప్రేమకథ ఒక చిన్న రహస్యంలా మొదలై, ఇప్పుడు అందరి ఆశీస్సులతో పెళ్లి వరకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

చదువుకే ప్రాధాన్యం
చదువు విషయంలో నేను చాలా శ్రద్ధ చూపించాను. బీబీఏ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో అడ్వరై్టజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ కోర్సు చేశాను. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయినా చదువును మధ్యలో వదిలిపెట్టకుండా, గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చాను.

ఫొటోగ్రఫీ నా ప్రశాంత ప్రపంచం
షూటింగ్‌ గ్యాప్‌ దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకు ఎంతో ఇష్టం. ఆ పని నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఊరోడిని పెళ్లి చేసుకున్నా!
నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే, కాని, కిరణ్‌ మాత్రం పక్కా పల్లెటూరోడు. షూటింగ్‌ సెట్లో మొదలైన మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన మా ప్రయాణాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవంగా అంగీకరించారు.

వంట చేయడం నా ప్రత్యేక హాబీ
కొత్త కొత్త వంటకాలు చేయడం నాకు హాబీ. ముఖ్యంగా స్వీట్లు తయారు చేయడంలో నాకు మంచి నైపుణ్యం ఉంది. పెళ్లి తర్వాత కిరణ్‌ కోసం మరిన్ని ఆంధ్ర శైలి వంటకాలు కూడా నేర్చుకున్నాను.

బిర్యానీ అంటే ఒక ఎమోషన్‌
హైదరాబాదీస్‌కు బిర్యానీ అంటే ఒక ఎమోషన్‌. నా ఫేవరెట్‌ ఫుడ్‌ కూడా బిర్యానీనే. అయితే ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారంపై  కొంత శ్రద్ధ పెడుతున్నాను. అయినా అప్పుడప్పుడు బిర్యానీ రుచిని ఆస్వాదిస్తున్నాను.

భవిష్యత్తు కుటుంబం, కెరీర్‌ రెండూ కలిసి
భవిష్యత్తులో నటిగా కొనసాగుతూనే, కిరణ్‌తో కలిసి ఒక అందమైన కుటుంబ జీవితం గడపడం నా లక్ష్యం. అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు అతిపెద్ద విజయం. ప్రస్తుతం ‘కిరణ్‌ అబ్బవరం’ నిర్మాణ సంస్థ పనులతో బిజీగా ఉన్నాను.

Videos

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

నడిపించేది మొత్తం మంగ్లీ..! డబ్బులే డబ్బులు అని నమ్మించి ఇలా చేసింది

బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

Photos

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)