Breaking News

ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు : రవిబాబు

Published on Sat, 05/02/2026 - 09:11

ఒకప్పుడు సినిమా తీసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేసేవారని..ఇప్పుడు ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు నటుడు, దర్శకుడు  రవిబాబు. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకత్వంలో రేజర్‌ అనే సినిమా రాబోతుంది. ఇందులో ఆయనే హీరోగా నటించాడు. మే 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు రవిబాబు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికీ ఇప్పటికి ఫిలిం మేకింగ్ లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘అప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని తీసేవాళ్లు. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు బలిసి చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 'ఫిల్మ్'లో సినిమా తీస్తాం కాబట్టి, దానిపై ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫిల్మ్ చాలా ఖరీదైనది కావడంతో, యాక్టర్స్ , డైరెక్టర్స్‌,  కెమెరామెన్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్లు చేసేవాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. చిప్ వేస్తున్నాడు, తీస్తున్నాడు.. మళ్లీ అదే చిప్ పెడుతున్నాడు. దాని కాస్ట్ కూడా కాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. 

ఎందుకంటే బేసిక్ ఇన్ ఫుట్ టెక్నాలజీ మీద, టైమ్ మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. అప్పట్లో  టైమ్‌కి,డబ్బులకి వ్యాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఒకప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా డిసిప్లైన్ గా జరిగేది. ఇప్పుడు అలాంటి డిసిప్లైన్ లేదు’ అని రవిబాబు అన్నారు. అయితే ‘ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు’ అని విమర్శించడాన్ని కొంతమంది నెటిజన్స్‌ తప్పుపడుతున్నారు.  టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. ‍మరికొంతమంది రవిబాబు వ్యాఖ్యలలో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు.

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)