Breaking News

జూన్‌లో సింగ్‌ గీతం

Published on Sat, 05/02/2026 - 06:24

మూకీ చిత్రం ‘పుష్పక్‌’, టాకీ సినిమాలు ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్‌ మదన కామరాజన్ ’, ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని తాజా సినిమాకు ‘సింగ్‌ గీతం’ అనే టైటిల్‌ ఖరారైంది. 94 సంవత్సరాల వయసులో ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ మ్యూజికల్‌ ఫాంటసీ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ సినిమాను జూన్  11న రిలీజ్‌ చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్‌. ‘కుబేరపురం... అసలు ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడు అంకుల్‌ మా నాన్న ఈ ఊరిని... రాజా ట్రీట్‌మెంట్‌ ఇక్కడ..., మనకు ఒక ఫారిన్  డీల్‌ ఓకే అయ్యింది’ అనే డైలాగ్స్‌ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి. ‘‘ఒక మిస్టీరియస్‌ విలేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 

ప్రతాప్‌ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్‌ జీవితం అనుకోని మార్గం లోకి వెళుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగుపెడతాడు. దీంతో ఓ సంఘర్షణలో చిక్కుకుని తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  

Videos

సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్

ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్

ORR కారు ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి

అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..

నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకే అర్ధం కావట్లేదు.. రిలీజ్ తర్వాత శ్రీహరి రియాక్షన్

ORRపై ప్రమాదం ఎలా జరిగిందో చూడండి.. AI Video

ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి

బెడ్ పై మహిళతో CI.. బెడ్ రూమ్ వీడియో వైరల్..

వాహనదారులకు బిగ్ షాక్.. త్వరలో పెట్రో బాదుడు!

Photos

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు