Breaking News

‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 05/01/2026 - 16:10

టైటిల్‌ : గాయపడ్డ సింహం
నటీనటులు: తరుణ్‌ భాస్కర్‌, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, శుభలేఖ సుధాకర్‌, విష్ణు తదితరులు
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ 
రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం

కథేంటంటే..
దరహాస్‌(తరుణ్‌ భాస్కర్‌), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్‌ పెట్టడంతో.. దరహాస్‌ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల వెన‌క్కి వ‌చ్చిన (డిపోర్ట్) భార‌తీయ విద్యార్థుల్లో దరహాస్‌ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్‌పై దరహాస్‌ పగపడతాడు. ఎలాగైన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్‌ టార్చర్‌ భరించలేక ఫ్రెండ్‌ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్‌పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్‌ పగకు మాఫియా డాన్‌ బ్రూటల్‌ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్‌(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చేతబడి.. ప్రాక్టికల్‌గా ఇది అసంభవం. ఇలాంటి పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే గాయపడ్డ సింహం. లైన్‌ వింటేనే నవ్వొస్తుంది. కథగా మలిస్తే ఎలా ఉండాలి? థియేటర్స్‌లో నవ్వులు వర్షం కురవాలి. కానీ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీ పండించడంలో పూర్తిగా సఫలం కాలేదు. చేతబడి కాన్సెప్ట్‌, బ్లాక్‌ బస్టర్‌ సినిమాల స్పూఫ్‌.. ఇవన్నీ సినిమాలో ఉన్నాయి కానీ..అవేవి పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అని పూర్తిగా బోర్‌ కొట్టించదు. కథ ఓకే కానీ..కథనం విషయంలోనే దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. బొమ్మరిల్లు, కేజీఎఫ్‌, అర్జున్‌ రెడ్డి, సలార్‌ లాంటి సినిమాల స్పూఫ్ సీన్లను మరింత బలంగా రాసుకోని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. 

డ్ర‌గ్స్ మాఫియాపై ఐజి విజ‌య‌కాంత్ (శుభ‌లేఖ సుధాక‌ర్‌) టీమ్‌ మెరుపు దాడులు చేసే సన్నివేశాలతో కథను సీరియస్‌గా ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ఫరియా, తరుణ్‌ భాస్కర్ల పెళ్లి చూపులు సీన్‌తో కథ కామెడీ వైపు టర్న్‌ తీసుకుంటుంది. ఇక దరహాస్‌తో తన తండ్రికి ముందే పరిచయం ఉందని శాలిని గ్రహించి.. నిజం చెప్పమని కోరడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. దరహాస్‌, గాయత్రి లవ్‌ స్టోరీని లైట్‌గా చూపించి..అమెరికాకు వెళ్లే ముందు హీరో ఇచ్చే బిల్డప్పులను హైలెట్‌ చేశాడు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. 

అయితే హీరో అమెరికా నుంచి తిరిగి వచ్చి.. పగతీర్చుకునేందుకు చేసే ప్రయత్నాల వరకు కథనం సోసోగానే నడుస్తుంది. ఎప్పుడైతే శ్రీవిష్ణు పాత్ర ఎంట్రీ ఇస్తుందో..అప్పటి నుంచి  కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎలాంటి సంబంధం లేని బ్రూటల్‌ ధర్మ పాత్రను ట్రంప్‌ చేతబడికి ముడిపెట్టిన విధానం బాగుంది. కానీ ఆయా సన్నివేశాలను మరింత కామెడీగా చూపించాల్సింది.  ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌. కథనం కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది.  బొమ్మరిల్లు, కేజీఎఫ్‌ సినిమాల స్పూఫ్‌ కొంతవరకు నవ్విస్తుంది. మిగతా సినిమాల స్పూఫ్‌ జస్ట్‌ ఓకే.  ఇక ఆర్జీవీ, జేడీ చక్రవర్తిల కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘సత్య’ మూవీకి ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే క‌థ‌నం పూర్తిగా  నెమ్మ‌దించ‌డంతో ముందుకు పోకుండా అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్న‌ట్టు అనిపిస్తుంది.  క్లైమాక్స్‌లో శ్రివిష్ణు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా  వెళితే ‘గాయపడ్డ సింహం’ కొంతవరకు ఎంటర్‌టైన్‌ చేస్తుంది. కామెడీ ఆశించి వెళ్తే మాత్రం.. ప్రేక్షకుడి మనసు గాయపడక తప్పదు. 

ఎవరెలా చేశారంటే.. 
దరహాస్‌ పాత్రకు తరుణ్‌ భాస్కర్‌ న్యాయం చేశాడు.  ఆయన అమాయకత్వం, డైలాగులు కీడాకోల సినిమాను గుర్తు చేస్తాయి. బ్రూటల్‌ ధర్మగా జేడీ చక్రవర్తి బాగానే చేశాయి. అయితే ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా అద్భుతంగా అయితే లేదు. ఫస్టాఫ్‌లో డాన్‌లా కనిపించే సన్నివేశాలు బాగున్నాయి కానీ.. కామెడీ మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదు. తండ్రితో ప్లాష్‌బ్యాక్‌ని గంభీరంగా చెప్పించ‌డం త‌ప్ప ఫ‌రియా అబ్దుల్లాకి పెద్ద‌గా న‌టించే అవ‌కాశం రాలేదు.  శ్రీవిష్ణు తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు ఆయన పాత్రే ప్లస్‌ అని చెప్పాలి.  సినిమా చూసిన వాళ్లకు భైరవ దాస్‌ పాత్ర గుర్తుండిపోతుంది.  శుభలేఖ సుధాకర్‌, హర్ష, విష్ణుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్వీకర్ అగస్తీ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)