ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
Published on Sat, 04/25/2026 - 12:14
వ్యాయామాలు కూడా ఎలా పడితే అలా చేసేయకూడదు అనే చెప్పే ఘటన ఇది. బరువు తగ్గడం కోసం లేదా ఫిట్నెస్ గురించి అయినా..నిపుణులు సలహాలు సూచనలతో చేయడమే మేలు. ఎందుకంటే అతి వేగవంతంగా చేసే వ్యాయామాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయి కూడా. అందుకు ఈ అనూహ్య ఘటనే ఉదాహరణ.
ఇది నాగ్‌పూర్‌లోని ఒక జిమ్‌లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఓం భోయార్ జిమ్‌లో నాలుగు గంటల పాటు వ్యాయామం చేశాడు. అక్కడ డెడ్‌లిఫ్ట్ చేయడానికి తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే క్షణాల్లో కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వృత్తిరీత్యా నర్సు అయిన అతడి తల్లి ఆర్తి భోయార్ గోల్డెన్ అవర్‌గా చెప్పే తొలి 3-4 గంటల సమయం అవసరమయ్యే వైద్య పరిస్థితిని వృధా కానివ్వకుండా హుటాహుటినా ఆస్ప్రతికి తీసుకువెళ్లింది.
అక్కడ వైద్యులు రోగ నిర్థారణ పరీక్షలలో అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. దానిని మెకానికల్ థ్రాంబెక్టమీ విధానం ద్వారా తొలగించారు. తత్ఫలితంగా దీనివల్ల అతని మెదడుకు రక్త ప్రసరణ సజావుగా జరిగి, త్వరితగతిన కోలుకోవడానికి సహాయపడింది. ఈ ఘటనలో అతని తల్లి సకాలంలో స్పందించడం వల్లే ఓం భోయార్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. అంతేగాదు ఆరోగ్య నిపుణులు శారీరక సామర్థ్యానికి మించి మితిమీరి వ్యాయామాలు చేసేవాళ్లందరకీ ఇదొక హెచ్చరికని అని చెబుతున్నారు.
ఇక్కడ హెమరేజిక్ స్ట్రోక్‌లో, మెదడులోని రక్తనాళం చిట్లి, రక్తం చుట్టుపక్కల కణజాలంలోకి లీక్ అవుతుంది. ఇది మెదడులోని సంబంధిత భాగాలకు, వాటికి అనుసంధానించబడిన శరీర భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుఉంది. దాంతో శరీర భాగాలు పక్షవాతానికి గురవుతాయని చెబుతున్నారు వైద్యులు. సకాలంలో శస్త్ర చికిత్స అందించి మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించి, పక్షవాతం ప్రభావాలను తగ్గించి, కోలుకునే అవకాశాలను పెంచవచ్చు.
(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్‌లో టాపర్‌గా!)
Tags : 1