ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
అడివి శేష్ ప్రేమ కథ.. కళ్లు చెమ్మగిల్లే స్టోరీ
Published on Sat, 04/25/2026 - 12:03
డెకాయిట్ మూవీతో అడివి శేష్ ప్రేక్షకులను మెప్పించాడు. భగ్నప్రేమికుడు ఎలా ఉంటాడో చాలా ఎమోషనల్ టచ్‌తో నటించాడు. గతంలో గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో సీరియస్ పాత్రలు చేసినప్పటికీ అందులో లవ్ సీన్ వస్తే జీవించేస్తాడు. ఇంతటి బరువైన సీన్‌లో కూడా సులువుగా అతను నటించడం చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 'క్షణం', 'డెకాయిట్' వంటి సినిమాల్లో ఆ 'బిట్టర్ స్వీట్ పెయిన్' ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ వివరణ ఇచ్చారు.
సినిమాల్లో ఎంట్రీకి ముందు అడివి శేష్ అమెరికాలో ఉండేవారని తెలిసిందే. అక్కడ తనకు 17ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని శేష్ ఇలా చెప్పాడు. అయితే, ప్రేమ విషయంలో ఎంతో క్షోభను అనుభవించానంటూ కొన్ని బాధాకరమైన విషయాలను ఇలా బయటపెట్టారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను.. కానీ, రెండూ విషాదాన్నే ఇచ్చాయి. నా పుట్టినరోజు నాడే ప్రేమించిన అమ్మాయి మరోకరిని పెళ్లి చేసుకుంది. ఆ సంఘటన నేను భరించలేకపోయాను. ప్రతి పుట్టినరోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మరో ప్రియురాలు అకాల మరణం ఎంతగానో నన్ను కుంగదీసింది.
అడివి శేష్ ప్రేమ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అడివి శేష్ జీవితంలో ఇంతటి విషాదమా..? అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ గుండె కోత వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందేనని . ఆయన ధైర్యానికి ఫిదా అవుతున్నారు.
Tags : 1