Breaking News

ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!

Published on Thu, 04/23/2026 - 14:01

కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.

వైట్-కాలర్‌ ఉద్యోగాల్లో భారీ కోత

ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్‌బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.

నోబెల్ గ్రహీత అభ్యంతరం

అమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్‌తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.

‘అమోదికి ఏమీ తెలియదు’

ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్‌ మార్కెట్‌పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)