భార్యకు ఆస్తి ఉన్నా భర్త భరణం ఇవ్వాలా?

Published on Wed, 04/22/2026 - 14:06

నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య ఇంజినీరింగ్‌ చేసింది కానీ కావాలనే ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటోంది. ఇటీవల కొంతకాలంగా నా భార్య – ఆమె కుటుంబ సభ్యులతో నాకు తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆమె నాపై కేసులు వేస్తానని, నా ఆస్తులను, డబ్బును తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో అలాంటిదేమైనా జరిగితే, నా ఆర్థిక వనరులను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నా సంపాదన ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీఎఫ్‌ రూపంలో దాచుకున్నాను. కొంత భూమి కూడా కొన్నాను. స్టాక్‌ పెట్టుబడులను భరణం/మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా? ముందుగా నా తల్లితండ్రులకు నగదు, స్థిరాస్తులు అన్నీ బదిలీ చేస్తే సరిపోతుందని, వీలైతే జీతం కూడా వేరే అకౌంట్‌లోకి తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మిత్రులు చెప్తున్నారు. నిజానికి నా భార్యకి చాలా ఆస్తి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ నాన్న పేరిట ఉంది. తన తదనంతరం నా భార్యకేనని రిజిస్టర్డ్‌ వీలునామా కూడా ఉంది. అయినా నేను భరణం ఇవ్వాలా?
– రఘురామ్, విజయవాడ 

ఆస్తులను/నగదును దాచిపెట్టే ఉద్దేశంతో చేసే ఏ విధమైన నిధుల బదిలీలు అయినా బ్యాంకింగ్‌ రికార్డుల ద్వారా సులభంగా గుర్తించబడతాయి. కోర్టులకు బ్యాంకులనుండి, కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి కూడా ఆర్థిక వివరాలను సమీకరించే అధికారాలు ఉన్నాయి. వివాహ సంబంధిత కేసుల్లో, కోర్టు సాధారణంగా వివాహం జరిగిన తేదీ నుండి మీ ఆదాయం, ఆస్తులు ఆర్థిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. 

మెయింటెనెన్స్/భరణం కోరిన తేదీ నుండి గత మూడు సంవత్సరాల ఆర్థిక వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్, ఆస్తుల వివరాలు, ఖర్చులు, ఐటీ చరిత్ర మొదలగు అంశాలు వెలువరిస్తూ ఆస్తులు– అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. జీతాన్ని ఇతరుల ఖాతాలకు మళ్లించడం వంటి ప్రయత్నాలు వంటివి చేసినా, అనవసర ఆస్తి బదిలీ చేసినా, సులభంగా దొరికి΄ోతారు. అవి దురుద్దేశపూర్వక చర్యలుగా పరిగణించబడతాయి. పీఎఫ్, పీపీఎఫ్, ఫిక్స్‌డ్‌ డి΄ాజిట్లు, స్టాక్‌ పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక ఆస్తులను భరణం లేదా మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కోర్టు మీ నిజమైన ఆర్థిక స్థితి, సంపాదన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా చేసుకుంటుంది. 

ఆస్తులను దాచడం లేదా మాయ మాటలు చెప్పడం చట్టపరంగా ప్రమాదకరం, మీ కేసులో హానికరం. ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం కోర్టు ముందు మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, ఒక నిపుణుడైన కుటుంబ న్యాయవాదిని సంప్రదించి చట్టబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాలి. మీపై మెయింటెనెన్స్ క్లెయిమ్‌ వస్తే, మీరు కింది అంశాల ఆధారంగా దాన్ని వ్యతిరేకించవచ్చు.

మీ భార్య విద్యార్హతలు, ఉద్యోగం చేసే సామర్థ్యం ∙ఆమె సంపాదించగలగడం, ఉద్యోగం చేయాల్సిన అవసరం 

కావాలని ఉద్యోగం మానేయటం గురించిన వివరాలు 

మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టతతో, చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీ ప్రయోజనాలను మెరుగ్గా రక్షించుకోవచ్చు. మైనర్‌ పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు ఉంటే మాత్రం, మీరు ఎంత ప్రయత్నించినా కాస్తో కూస్తో తగ్గవచ్చు గానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టాల్సిందే. 

 

 

Videos

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు

ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు

పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు

పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?

మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం

చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్

జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..

సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు

Photos

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)