Breaking News

అమెరికా–ఇరాన్‌ డీల్‌పై ఆశలతో...

Published on Wed, 04/22/2026 - 02:32

ముంబై: అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలతో పాటు క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 95 డాలర్ల కిందకి దిగిరావడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్‌ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 212 పాయింట్లు బలపడి 24,577 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.

క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన లాభాలతో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌  847 పాయింట్లు పెరిగి 79,367 వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు ఎగసి 24,602 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని  మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది. 

ఆసియాలో దక్షిణ కొరియా (2.65%), తైవాన్‌ (1.72%), జపాన్‌(1%), హాంగ్‌కాంగ్‌(0.48%), సింగపూర్‌ (0.22%), చైనా (0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ (–0.40%), బ్రిటన్‌ (–0.50%) మార్కెట్లు నష్టపోగా, అయితే  జర్మన్‌ (0.10%) పెరిగింది. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 

రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఎఫ్‌ఎంసీజీ (2.23%), రియల్టీ (2.17%), ప్రైవేటు బ్యాంకులు (1.71%), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (1.32%), టెలికమ్యూనికేషన్‌ (1.14%), పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ (1%) పెరిగాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు వరుసగా 0.79%, 0.29 శాతం లాభపడ్డాయి.  
మార్చి త్రైమాసిక నికర లాభం 19% వృద్ధితో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% పెరిగి రూ.979 వద్ద స్థిరపడింది.  

28 పైసలు క్షీణించిన రూపాయి 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 93.44 వద్ద ముగిసింది. పశ్చి మాసియా శాంతి చర్చలపై అనిశ్చితి, క్రూడ్‌ ధరల్లో ఒడిదుడుకులు వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి. నాన్‌–డెలివరబుల్‌ ఫార్వర్డ్‌(ఎన్‌డీఎఫ్‌) మార్కెట్లలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ నియంత్రణలను సడలింపు నిర్ణయమూ దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు.  

Videos

24వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి.. అవాక్కైన శాస్త్రవేత్తలు

చిరంజీవి-బాబీ సినిమా టైటిల్ ఇదేనా..?

బస్సులు లేక జేబీఎస్ నిర్మానుష్యం.. ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

కోదండరామ స్వామి ఆలయంలో YS జగన్ కు వేదాశీర్వాదం

కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన.. గల్ఫ్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

పులివెందులలో వైఎస్ జగన్

సమస్యలపై నిరసన చేస్తే డిస్మిస్ చేస్తారా?

డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

కావాలనే నా భర్తని.. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య ఎమోషనల్

Photos

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)