అప్పుడు భయం వేసింది!

Published on Tue, 04/21/2026 - 00:02

సంగీత దర్శకుడు, నటుడు రఘుకుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘గేదెల రాజు’. టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి, వికాస్‌ ఇతర పాత్రల్లో నటించారు. రఘు కుంచె సమర్పణలో చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా రఘుకుంచె విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్క్రీన్‌పై నేను ఆద్యంతం ఉండే పాత్రలో నటించిన ‘గేదెల రాజు’ నాకు ప్రత్యేకం. ఈ మూవీ కోసం 12 కేజీల బరువు పెరిగాను. ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో భాగంగా  సమయానికి డూప్‌ కత్తులు దొరక్కపోవడంతో నిజమైన కత్తులు వాడాం.

ఇవి ఎక్కడ గాయపరుస్తాయేమోనని ఆ సమయంలో భయం వేసింది. ఈ సినిమా కోసం దర్శకుడు చైతన్య, అతని టీమ్‌ చాలా కష్టపడ్డారు. ఆ కష్టం చూసి ఈ సినిమాలో నేనూ భాగస్వామ్యం కావాలనుకుని సమర్పకుడిగా మారాను. ఇప్పుడు నేపథ్య సంగీతం అంటే శబ్దంలా మారిపోయింది.

కానీ, ఈ చిత్రంలో నేను మాత్రం క్యారెక్టర్‌ను బీజీఎం డామినేట్‌ చేయకుండా సెటిల్డ్‌గా కంపోజ్‌ చేశాను. మా సినిమాను నైజాంలో మైత్రీవాళ్లు 100కిపైగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఏపీ–తెలంగాణ లో 200 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 60చోట్ల మా సినిమా రిలీజ్‌ అవుతోంది. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌గారి సినిమాతో పాటు రైటర్‌ కల్యాణ చక్రవర్తి రూపొందిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నాను’’ అని చెప్పారు.

Videos

లోకేష్ నిద్రపోడు, నీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా!

టీ తాగితే క్యాన్సర్ కు చెక్! కానీ ఇలా తాగండి..

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజయ్ భారీ సినిమా

భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...

Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!

మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి

అమెరికా యూనివర్సిటీలో బంగారు ఫలకంపై రోజా కూతురి పేరు

సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

గుంటూరు జిల్లాలో దారుణం మైనర్‌పై అత్యాచారం

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

Photos

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా దీప్షిక చంద్రన్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో డస్కీ బ్యూటీ డింపుల్ (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

+5

సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ‘కళా సెంటినియల్‌ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)