Breaking News

మరోసారి తల్లి కాబోతున్న దీపిక.. ‘రాకా’ కోసం కీలక నిర్ణయం!

Published on Mon, 04/20/2026 - 13:05

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని ఆదివారం అభిమానులతో పంచుకుంది దీపిక. దీంతో అందరూ ర‌ణ్‌వీర్‌, దీపిక దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. అదే సమయంలో ఆమె కొత్త సినిమాలపై రకరకాల పుకార్లను కూడా పుట్టించారు. దీపిక ఇక ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనదని.. పూర్తిగా రెస్ట్‌ తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆమె విశ్రాంతి తీసుకోనున్నారట.

రాకా కోసం యాక్షన్‌
దీపికా ఒప్పుకున్న సినిమా రాకా ఒక్కటి. అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. స‌న్ పిక్చ‌ర్స్ ఏకంగా రూ.800 కోట్ల బ‌డ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా స‌గం కూడా పూర్తికాలేదు. ఇందులో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం. గర్భం  దాల్చినప్పటికీ.. యాక్షన్‌ సీన్స్‌ చేయడానికి దీపికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్‌ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయం దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో.. వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. 

‘కింగ్’కోసం కూడా.. 
దీపికా ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘కింగ్‌’. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇందులో కూడా దీపిక పదుకొణె పాత్రకు యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటూనే పూర్తి చేయాల్సి ఉంది. తనవల్ల షూటింగ్‌కి అంతరాయం కావొద్దనే దీపికా ఈ నిర్ణయం తీసుకుందట. ‘పఠాన్‌’లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత షారుక్‌ఖాన్‌ - సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Videos

భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...

Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!

మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి

అమెరికా యూనివర్సిటీలో బంగారు ఫలకంపై రోజా కూతురి పేరు

సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

గుంటూరు జిల్లాలో దారుణం మైనర్‌పై అత్యాచారం

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

టార్చి లైట్ మినిస్టర్ ఎవరు..?

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్

మంగ్లీ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని

Photos

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా దీప్షిక చంద్రన్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో డస్కీ బ్యూటీ డింపుల్ (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

+5

సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ‘కళా సెంటినియల్‌ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)