Breaking News

పవన్‌ మీరు సిద్ధమేనా.. కౌంటర్‌ విసిరిన ప్రకాష్‌ రాజ్‌

Published on Sat, 04/18/2026 - 13:22

లోక్‌సభలో  రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. బీజేపీ డీలిమిటేషన్‌ కుట్రలను ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. దీంతో  లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు మోదీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లుకు బ్రేక్‌ పడటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ పేజీలో విపక్షాలపై మండిపడ్డారు. దీంతో ఆయనకు కౌంటర్‌గా సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో విపక్షాలు వ్యతిరేఖంగా నిలబడ్డాయని పవన్‌ కల్యాణ్‌ ఇలా అన్నారు. భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని పవన్‌ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంతో  విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ తెలిపారు. అయితే. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్‌ చేశారు.

పవన్‌ మీరు సిద్ధమేనా..?: ప్రకాష్‌ రాజ్‌
దయచేసి ప్రధాని మోదీని మెప్పించడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని పవన్‌ కల్యాణ్‌కు ప్రకాష్‌ రాజ్‌ సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఇప్పుడైనా ఆమోదించవచ్చని చెప్పుకొచ్చారు. 'కానీ, మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది, ఇది ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. మిమ్మల్ని డీసీఎం చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా..? ' అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రకాష్‌ రాజ్‌ కోరారు.
 

Videos

వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం

డయాబెటిస్ ఉన్నా హాయిగా అన్నం తినొచ్చు! అన్నం ఇలా వండండి

లోక్ సభలో రచ్చ రచ్చ.. డీలిమిటేషన్ తో సౌత్ కి నిజంగా నష్టమేనా

ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?

సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు

హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్

ఇటలీ ప్రధానికి ముద్దు పెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

భార్య ఓవర్ యాక్షన్ తో భర్తకు కష్టాలు.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు..

ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!

లోకేష్ వేస్ట్.. క్లాస్ రూమ్ లో మందు.. మద్యానికి బానిసగా గురుకుల విద్యార్థులు

Photos

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)