Breaking News

పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్‌ జలసంధి

Published on Sat, 04/18/2026 - 13:13

ఇప్పుడు రోజూ హార్మోజ్‌ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్‌ రోడ్‌కి వెళ్లినట్టు. హోర్ముజ్‌ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్‌ దేశం, ఒమన్‌ దేశం మధ్యలో ఉంది. పర్షియన్‌ గల్ఫ్‌ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్‌లో చూస్తే V షేప్‌లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్‌’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్‌.

ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?
ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్‌లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్‌ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్‌ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్‌ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్‌ 2 కోట్ల లీటర్ల ఆయిల్‌ తీసుకెళ్లగలదు!

ఇక్కడ ఎందుకు గొడవలు?
ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్‌ దొరకడం కష్టం. పెట్రోల్‌ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్‌లో చాలా భాగం గల్ఫ్‌ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్‌ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్‌ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్‌ పంచే ‘సన్నటి డోర్‌’. ఆ డోర్‌ సేఫ్‌గా ఉంటేనే మన వాహనాలు స్మూత్‌గా నడుస్తాయి.  

Videos

వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం

డయాబెటిస్ ఉన్నా హాయిగా అన్నం తినొచ్చు! అన్నం ఇలా వండండి

లోక్ సభలో రచ్చ రచ్చ.. డీలిమిటేషన్ తో సౌత్ కి నిజంగా నష్టమేనా

ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?

సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు

హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్

ఇటలీ ప్రధానికి ముద్దు పెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

భార్య ఓవర్ యాక్షన్ తో భర్తకు కష్టాలు.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు..

ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!

లోకేష్ వేస్ట్.. క్లాస్ రూమ్ లో మందు.. మద్యానికి బానిసగా గురుకుల విద్యార్థులు

Photos

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)