Breaking News

శ్రీ రాముడిపై ప్రకాష్‌ రాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

Published on Fri, 04/17/2026 - 09:05

శ్రీరాముడు హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుడిగా ఆరాధిస్తారు. రాముడు నిత్యజీవితంలో మమేకమై ఉంటాడని నమ్ముతారు. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు.  రాముడి వీరత్వంలో తిరుగులేదు. ఎంతో కీర్తి ఉన్న రాముడు, లక్ష్మణులను వలస కూలీలు అని సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేర్కొనడం సిగ్గుచేటని నెటిజన్లు భగ్గుమంటున్నారు. గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక చిక్కుల్లో పడిన ఆయన ఇప్పుడు మరోసారి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.

కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్  రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ..  రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని,  వారిద్దరూ దక్షిణ భారత్‌కు చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే, దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని  అడిగినట్లు ఎద్దేవా చేశాడు. ఈ కారణం వల్లనే వివాదం మొదలైందని  ఎటకారంగా కామెంట్‌ చేశాడు. ప్రకాష్‌ రాజ్‌ చేసిన  ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు  నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

బీజేపీ కార్యవిధానాన్ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఈ దేశంలో ప్లాన్‌ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడగులు పడుతున్నాయి. వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు.  ఆపై గిరిజనులను, మైనారిటీలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు." అని ఆయన అన్నాడు. కానీ, మత సామరస్యం, ప్రజల విశ్వాసం అనే అంశాన్ని తీసుకుని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నెటిజన్లు అనేక పోస్టులు పెడుతున్నారు. రాబోయే ప్రాజెక్టులలో ఆయనకు అవకాశం ఇవ్వడంపై చిత్రనిర్మాతలు పునరాలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి  వారు వారణాసి, స్పిరిట్, దృశ్యం 3  చిత్రాల నుంచి ఆయన్ను తొలగొంచాలని కోరుతున్నారు.
 

Videos

మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు

లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)