"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
‘హే బాబు’ వెళ్లిపో.. మోహన్ బాబుకే వార్నింగ్ ఇచ్చిన అవ్రామ్ : ఫన్నీ వీడియో
Published on Thu, 04/16/2026 - 16:52
ఖాలీ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడపడానికి ఇష్టపడే నటుల్లో మంచు విష్ణు ఒకరు. పిల్లలను ఆడించడమే కాదు..వారితో కలిసి ఆయన కూడా అల్లరి చేస్తుంటాడు. షూటింగ్ సమయాల్లోనూ అవకాశం ఉంటే పిల్లలను సెట్స్‌కి తీసుకెళ్తుంటాడు. అలాగే మోహన్ బాబు కూడా తన మనవళ్లు, మనవరాళ్లతో చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. బయట కానీ, సినిమాల్లో కానీ కాస్త గంభీరంగానే ఉండే ఆయన.. పిల్లల దగ్గరకు వచ్చేసరికి కమెడియన్‌గా మారిపోతాడు. అందుకే తాతయ్య అంటే వారికి చాలా ఇష్టం. ఇక అవ్రామ్ అయితే తాతయ్యని ఆటపట్టిస్తుంటాడు.
తాజాగా ఆయన తాతయ్యకే వార్నింగ్ ఇచ్చాడు. మోహన్ బాబు, విష్ణు ఇంట్లో కూర్చోని మాట్లాడుకుంటుండగా, అవ్రామ్ వచ్చి అల్లరి చేస్తుంటాడు. ఇది చూసిన మోహన్ బాబు ‘కామ్ గా ఉండాలి. అల్లరి చేయొద్దు’ అనగా అవ్రామ్..‘ హే బాబు’ అంటూ మోహన్‌బాబును కళ్లలోకి కళ్లు పెట్టి చూసి బెదిరిస్తాడు. అంతేకాదు గ్రౌండ్ చేయ్, వెళ్లిపో అంటూ కాసేపు తాతకే వార్నింగ్ ఇచ్చాడు. రచ్చ రచ్చ చేసి చివరకు ‘బాయ్ బాబు’ అంటూ ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు.
మనవడి అల్లరి తట్టుకోలేక..చివరకు మోహన్ బాబే సైలెంట్ అయిపోయాడు. ఈ ఫన్నీ వీడియోని మంచు విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ..‘విలన్‌లను, విమర్శకులను, కఠినమైన పాత్రలను లయన్ కింగ్ (మోహన్‌బాబు) ఎదుర్కొన్నారు. కానీ, అవ్రామ్ మూడు నిమిషాల అల్లరిని అడ్డుకోవడం మాత్రం ఆయన సాధ్యం కాలేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Tags : 1