మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ రిలీజ్

Published on Wed, 04/15/2026 - 19:43

మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్‌ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్‌లో నిలిచింది. ఏప్రిల్‌ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. 

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.

వాళాకు సీక్వెల్‌..

2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్‌ దాస్‌ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.  వాళా అంటే మలయాళంలో అరటి మొక్క ‍అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట.

 

 

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)