Breaking News

అడవిలో సవాల్‌

Published on Wed, 04/15/2026 - 00:46

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ రాజమహేంద్రవరంలో ఆరంభమైంది. ‘‘ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్‌ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్‌ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.

శర్వానంద్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘భోగి’ ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. దిలీప్‌ సుబ్బరాయన్‌ పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రక్షా బంధన్‌ సందర్భంగా ఆగస్ట్‌ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: కిశోర్‌ కుమార్‌ అరోకియా.

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)