సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Breaking News
వాళా-2 సూపర్ హిట్.. పార్ట్-3 అధికారిక ప్రకటన
Published on Tue, 04/14/2026 - 15:32
ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు.
హిట్ మూవీకి సీక్వెల్..
2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు.
#Vaazha3 - Biopic of a Billion Girls.
The #Vaazha franchise continues its journey of introducing fresh talent and new voices to cinema.
Production begins next year. pic.twitter.com/YcHanDL3Q6— Shine Screens (@Shine_Screens) April 14, 2026
Tags : 1