Breaking News

నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర

Published on Tue, 04/14/2026 - 15:01

దగ్గరవాళ్లు చనిపోతే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపు పుట్టిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. సింగర్ చిత్ర కూడా అలాంటి వేదనని గత 15 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తన కూతురు ఇక లేదనే విషయాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా కుమార్తెని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు.

(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)

'నువ్వు మాతో పాటు లేవనే నిజం నన్ను బాధపెడుతూనే ఉంది. కానీ మళ్లీ మనం కలుసుకునేంత వరకు నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావ్' అని కుమార్తె నందన ఫొటోని చిత్ర.. బాధతో పోస్ట్ చేశారు.

కేరళకు చెందిన చిత్ర.. భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్‌తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఈమెకు 2002లో కూతురు పుట్టింది. ఆమెకు నందన అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి కన్నుకుట్టిందో ఏమో గానీ పాపకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2011లో దుబాయిలో జరిగిన ఓ ప్రమాదంలో ఈత కొలనులో పడి నందన చనిపోయింది. అప్పటినుంచి వేదన అనుభవిస్తున్నప్పటికీ.. మరోవైపు గాయనిగానూ చిత్ర కొనసాగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ పెట్టి కూతురిని చిత్ర మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

(ఇదీ చదవండి: మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్)

Videos

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..

బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బులే! విష్ణుప్రియపై ఫిర్యాదుల వెల్లువ..?

తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)