Breaking News

టాలీవుడ్‌ బిగ్‌ పాన్‌- ఇండియా సినిమాలో అలియా భట్‌

Published on Tue, 04/14/2026 - 12:18

బాలీవుడ్‌ ప్రముఖ నటి అలియా భట్‌ మరోసారి టాలీవుడ్‌కు రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు కథనాలు బాలీవుడ్‌ మీడియాలో రావడం విశేషం. రాబోయే పాన్-ఇండియా తెలుగు చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం  అలియా భట్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఖరారైతే ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది.  ఆపై ఈ ప్రాజెక్ట్‌కు దేశవ్యాప్తంగా బలమైన ప్రచారం జరుగుతుంది. అయితే, ఏ సినిమాలో అలియా నటించనున్నారనే అంశం చాలామందిలో ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌).. ఈ ప్రాజెక్ట్‌లో అలియా భట్‌ కీలకపాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, ఆలియా కోసం ఒక కీలకమైన, పవర్‌ఫుల్‌ పాత్రను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది . ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో సీతగా కనిపించిన విషయం తెలిసిందే.

ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఆల్ఫా’ లో కూడా ఆమె పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తుంది. ఇందులో అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్‌’ ఫేమ్‌ శివ్‌ రైవల్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్‌లో నటించారు.  ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌  ప్రకటించారు.

Videos

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..

బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బులే! విష్ణుప్రియపై ఫిర్యాదుల వెల్లువ..?

తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)