ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
Breaking News
నటి త్రిషకు వార్నింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు
Published on Tue, 04/14/2026 - 07:08
ఇటీవల సినీ సెలబ్రిటీ ఇళ్లలో బాంబు బెదిరింపు కాల్స్ అధికం అవుతున్నాయనే చెప్పాలి. రెండు రోజుల క్రితం స్థానిక పోయస్ గార్డెన్‌లోని నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హుటాహూటిన పోలీసులు తమ టీమ్‌తో పాటు పోయస్ గార్డెన్‌కు వెళ్లి సర్చింగ్ చేశారు. కొన్ని గంటల పాటు నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడ బాంబులు పెట్టిన జాడ తెలియకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది.
తాజాగా స్థానిక తేనాంపేటలోని నటి త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో స్థానిక తేనాంపేట పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్స్‌తో పాటు నటి త్రిష ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబులు కనిపించకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసిన వారిని పట్టుకునేపనిలో ఉన్నారు.
Tags : 1