Breaking News

గరిట పట్టిద్దాం

Published on Tue, 04/14/2026 - 00:25

వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్‌ ఉంటుంది. చదువులకు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం. కుకింగ్, మనీ మేనేజ్‌మెంట్, క్రియేటివ్‌ ఆర్ట్స్, రీ సైక్లింగ్, ఫిజికల్‌ యాక్టివిటీస్, నేచర్‌ లైఫ్, గ్లోబల్‌ ఎక్స్‌పోజర్, వెల్‌బీయింగ్‌ క్లాసెస్, కమ్యూనికేషన్, డిజటల్‌ అండ్‌ టెక్నాలజీ స్కిల్స్‌.. 
ఇవన్నీ పాఠాలుగా కాకుండా వివిధ రకాల అంశాలలో అవగాహన కలిగించడానికి మేలైన సమయం. ఈ వేసవిలో పిల్లలకు వినోదాన్ని కూడా ఇచ్చే అంశాలపై  నిపుణుల సూచనలతో వరుస కథనాలు.

వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్‌ ఉంటుంది. నచ్చిన ఆటలు, మెచ్చిన వినోదం.. వీటితోనే కాలక్షేపం చేయడం కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం కూడా. ఆ జాబితాలో ముందుగా వంటింట్లోకి తీసుకెళదాం. పిల్లలను కుదురుగా ఉంచేది, ఏకాగ్రతను పెంచేది, సహనాన్ని, టీమ్‌ వర్క్‌ని పరిచయం చేసే పాకశాస్త్రాన్ని పరిచయం చేద్దాం.. 

రోజూ అమ్మ చేసే వంటకు ఏదో వంక పెట్టే పిల్లలు ఉంటారు. ఒక వంట తయారు చేస్తే, మరోటి అడిగే వారూ ఉంటారు. ఇష్టమైనవన్నీ తయారుచేసి, సమయానికి బాక్స్‌ కట్టి ఇచ్చే అమ్మ పని తెలియాలంటే ఇదో చక్కని మార్గం కూడా. ‘అమ్మో! వంటింటిని పిల్లలకు అప్పజెప్పడమా!’ అని భయపడకుండా పిల్లల చేత గరిట పట్టిస్తే ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం.. 

→ రుచుల ఆస్వాదన
వంట పాత్రలు, అందుకు ఉపయోగించే వివిధ రకాల సాధనాలు ముందుగా పరిచయం అవుతాయి. ఆ తర్వాత వంట దినుసులు, కూరగాయలు, ఆకుకూరల పట్ల అవగాహన పెరుగుతుంది. వేటితో ఏ తరహా వంటకాలు తయారు చేయచ్చు, రుచులను కలపడం వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక సాధారణ పదార్థాన్ని కొత్తగా ఎలా రూ΄÷ందించవచ్చు, అనే ఆలోచన కూడా వారిలో అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా ఇటాలియన్ , జపనీస్, కొరియన్  వంటి అంతర్జాతీయ వంటకాలనూ పరిచయం చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది.

→ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం
తాము తయారు చేసిన వంటకాన్ని కుటుంబ సభ్యులు రుచి చూసి, ప్రశంసిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వయసులోనే ‘నేను చేయగలను‘ అనే భావన అలవాటు అవుతుంది. ఇంటì పనుల్లో తామూ భాగస్వాములు అవుతారు. వంట భారంగా కాకుండా సులభంగా చేసేలా ప్రోత్సహించవచ్చు.

→ జట్టుగా విజయం 
కుకింగ్‌ క్లాసులలో చేరితే పిల్లలు గ్రూప్స్‌గా పనిచేస్తారు. ఇది వారికి టీమ్‌వర్క్, కమ్యూనికేషన్  స్కిల్స్‌ను నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం, బాధ్యతలు 
పంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి.

→ సమతుల్యత సాధన
వంట సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వంటలో ఉపయోగించే పదార్థం తక్కువైతే ఎలా మార్చాలి, రుచిని ఎలా సర్దుబాటు చేయాలి... ఇవన్నీ పిల్లల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్యాలెన్స్‌ ఎంత అవసరమో తెలియజేస్తుంది.

→ మంచి అలవాట్లు
ముఖ్యంగా వంట చేయడం ద్వారా పిల్లలు ఆహార విలువ తెలుసుకుంటారు. ఏ పదార్థం ఆరోగ్యానికి మంచిది, ఏయే పోషకాలు వేటి ద్వారా లభిస్తాయి,.. వంటి విషయాలు అర్థమవుతాయి. వృథాను అరికట్టడం, మిగిలిన పదార్థాలను తిరిగి ఎలా ఉపయోగించడం, శుభ్రతను ఎందుకు పాటించాలి.. వంటి విషయాల్లో అవగాహన కలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.

→ బాధ్యత పెరుగుతుంది
వంట చేయడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా పని చేయడం నేర్చుకుంటారు. తమ పనిని తామే పూర్తి చేయడం, శుభ్రత పాటించడం వంటి బాధ్యతలు అలవాటు అవుతాయి. అంతేకాదు, వంట పనిలో భాగంగా వస్తువులను శుభ్రపరచడం, సర్దడం వంటి పనులూ నేర్చుకుంటారు. అదే సమయంలో గ్యాస్, ఎలక్ట్రిక్, కటర్స్‌.. వంటి వాడకంలో రక్షిత చర్యల గురించి అవగాహన కల్పించవచ్చు. 

ఇంట్లో వీలు కావడం లేదు అనుకునేవారు కుకింగ్‌ క్యాంప్స్‌లో చేర్పించవచ్చు. వంటల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వంట ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనూ, ఆనందాన్ని, రుచుల ఆస్వాదననూ పరిచయం చేయవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది కూడా.

వంట.. వ్యక్తిత్వ వికాస పాఠం
పిల్లలు వంట నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఒక డిష్‌ను ఎలా ప్రెజెంట్‌ చేయాలో తెలుస్తుంది. ప్రతి వంటకం తయారీకి పట్టే సమయం వారిలో ఆలోచనాశక్తిని, సహనాన్ని పెంచుతుంది. జంక్‌ ఫుడ్‌ ఎందుకు తీసుకోవద్దో తెలుస్తుంది. వంట అంటే ఆడవాళ్లు మాత్రమే చేసేది కాదని కుటుంబంలో అందరూ చేయవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. అయితే, వంట పని ఒక భారంగా కాకుండా వినోదాత్మకంగా మార్చగలిగితే పిల్లలు జాయ్‌ఫుల్‌గా రుచుల తయారీ పట్ల దృష్టి పెడతారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల చేత వంటను ఫన్‌గా చేయించవచ్చు. ఎక్కువ మంది పిల్లలతో కలిసి పాల్గొనేలా చేయాలంటే..అందుకు కిడ్స్‌ కుకింగ్‌ క్యాంప్స్‌ పిల్లలకు వినోదంతో పాటు విలువైన నైపుణ్యాలనూ నేర్పిస్తున్నాయి. 
– మీరా గిరిజ తాడిమేటి, చెఫ్‌

సాక్షి ‘హెల్త్‌ ప్లస్‌’ ఈపేపర్‌లో...
పిల్లలకు వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహార పదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే ప్రత్యేక కథనం... 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)