Breaking News

'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో

Published on Sun, 04/12/2026 - 11:58

తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)

'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇ‍క్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.

కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.

ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?

(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)