Breaking News

బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్‌ చూపిన దారి

Published on Sun, 04/12/2026 - 09:06

ఒకప్పుడు నిరుపయోగంగా, బీడుగా ఉన్న భూమి ఇప్పుడు  కొబ్బరి చెట్లతో పచ్చని తోటగా మారింది. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ నటుడు మాధవన్ ఈ ప్రాజెక్టును తన వ్యక్తిగత అభిరుచిగా సుమారు ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఓర్పు, ప్రణాళిక, సుస్థిర పద్ధతులతో నిరుపయోగంగా ఉన్న భూమిని ఎలా పునరుజ్జీవింపజేయవచ్చో ఆయన కృషి ప్రపంచానికి తెలియజేస్తుంది.

'ధురంధర్' చిత్రంలో  బలమైన పాత్రతో వెండితెరపై బహుముఖ నటనతో మెప్పించి ప్రశంసలు పొందిన నటుడు ఆర్. మాధవన్.. 2019 సమయంలో తమిళనాడులోని పళనిలో తన సోదరుడు శుభయోగ్యన్‌తో కలిసి కొబ్బరి సాగు ప్రారంభించారు. నిరూపయోగంగా ఉన్న బీడు భూమిని కౌలుకు తీసుకుని, కేవలం మూడేళ్లలోనే  విజయవంతంగా ఫలవంతమైన కొబ్బరి తోటగా మార్చారు. ఈ ఏడాది కొబ్బరికాయల దిగుబడి మరింత పెరగడంతో ఆదాయం కూడా వస్తుంది.  ఆయన నిరంతర కృషితో బీడు భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో  ఫలవంతమైన తోటగా రూపాంతరం చెందింది. 

2020లో, ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మొదటిసారి ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు, తమిళనాడులోని పళనిలో కొబ్బరి సాగు ప్రాజెక్ట్ పూర్తయిందంటూ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. బీడుగా ఉన్న భూమిలో హైబ్రిడ్ కాని, స్వచ్ఛమైన పొట్టి రకం కొబ్బరికాయలను పండించవచ్చని ఒక వ్యాసం ద్వారా రైతులకు సూచనలు ఇచ్చారు. రసాయన ఎరువులపై ఆధారపడకుండానే దిగుబడి పెంచుకోవచ్చని రుజువుతో చూపారు. మాధవన్‌ ముంబైల్నోఇ తన ఇంటి టెర్రస్‌పైన కూడా పలు చెట్లను పెంచుతున్నారు. చెర్రీస్‌, బొప్పాయ వంటి వాటితో ఆర్గానిక్‌ ఫలాలు పొందుతున్నారు. తన పడక గది పక్కనే కూరగాయలు పండుతున్నాయంటూ ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Videos

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

నారాయణ స్వామి నివాసానికి అంబటి రాంబాబు

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)