Breaking News

పుష్పవిలాసం... ఉద్యాన వినోదం

Published on Sun, 04/12/2026 - 02:39

ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్‌పూల నేల నెదర్లాండ్స్‌లోని క్యూకెన్  హాఫ్‌ గార్డెన్‌ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.

డచ్‌ భాషలో ‘క్యూకెన్  హాఫ్‌’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్‌ జాకోబా వాన్‌ బీరెన్‌ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్‌ కౌంటెస్, హైనాట్‌ కౌంటెస్‌గా ఉన్నారు. డచ్‌ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్‌ మార్టెన్ బ్లాక్‌ క్యూకెన్  హాఫ్‌ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌లు జాన్‌ డేవిడ్‌ జోచర్, అతని కుమారుడు లూయిస్‌ పాల్‌ జోచర్‌ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్‌ చేసిన ఇంగ్లీష్‌ ల్యాండ్‌స్కేప్‌ శైలే నేటి ఆధునిక క్యూకెన్‌హాఫ్‌ తోటలకు పునాది.

ఈ ఆధునిక క్యూకెన్  హాఫ్‌ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్‌ నేతృత్వంలో 20 మంది డచ్‌ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్‌ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్‌ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్  లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్‌ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.

టులిప్‌ తోటలతో పాటు క్యూకెన్  హాఫ్‌లో ఇంగ్లీష్‌ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్, జాపనీస్‌ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్, స్ప్రింగ్‌ మెడో, నేచురల్‌ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్‌ మేజ్‌ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్  హాఫ్‌ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్‌ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్‌ గార్డెన్స్‌.

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)