Breaking News

అదే నిజమైన విజయం: నిహారిక

Published on Sat, 04/11/2026 - 10:59

సంగీత్‌ శోభన్, నయన్‌ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ‘రాకాస’ వసూళ్ల పరంగా అన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించిందని యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ‘రాకాస’ యూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించగా, బ్రహ్మాజీ, మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

మైత్రీ రవి మాట్లాడుతూ– ‘‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్‌ సాధించాం. భవిష్యత్‌లో ఆమె చేసే సినిమాలన్నింటినీ మేమే డిస్ట్రిబ్యూట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ అంటే సినిమా హిట్‌ అయినట్లే. ‘రాకాస’ చిత్రాన్ని నమ్మి, తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు ‘థ్యాంక్స్‌’ అని చెప్పారు సంగీత్‌ శోభన్‌. 

‘‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్‌ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్‌ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు నిహారిక. ‘‘నా డ్రీమ్‌ని, నా కథను ఇంత వరకు తీసుకుని వచ్చిన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌కు థ్యాంక్స్‌’’ అని చెప్పారు మానస. పంపిణీదారులు సన్నీ, భాస్కర్, రమేశ్‌ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు.  

Videos

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!

మొయినాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

మద్యం తాగి పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు

కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)