Breaking News

స్పెయిన్‌లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!

Published on Fri, 04/10/2026 - 15:19

ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్‌లోని అరెనిల్లాస్‌. ఈ గ్రామం స్పెయిన్‌లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.

షరతులు
ఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్‌ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.

100 కంటే ఎక్కువ దరఖాస్తులు!
నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్‌ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

అరెనిల్లాస్‌ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.

ఇబ్బందులూ ఉంటాయ్!
ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.

ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్

#

Tags : 1

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)