ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స
Breaking News
నాకు లక్ లేదనడం బాధగా ఉంది: హీరోయిన్ కృతీ శెట్టి
Published on Fri, 04/10/2026 - 00:17
‘‘ఓ నటిగా నేను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్ని సినిమాలకు సరైన బాక్సాఫీస్ ఫలితాలు రాలేదు. దీంతో నా హార్డ్‌వర్క్ గురించి కాకుండా నాకు లక్ లేదని కామెంట్ చేస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. సినిమా రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు. కానీ అలాంటి కామెంట్స్ వల్ల ఒక అవకాశం మిస్ కావడమనేది బాధగా ఉంటుంది. ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా రిలీజవుతోంది.
‘ఈ సినిమాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి డౌట్‌గా ఉంది’ (సినిమా రిజల్ట్‌ను ఉద్దేశించి) అని కామెంట్ చేస్తున్నారు. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకోవడం నాకు బాధగా ఉంది. కానీ ఎప్పటిలానే ప్రతి సినిమాకీ నా వంతు కృషి చేస్తాను’’ అని చెప్పారు కృతీ శెట్టి. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.
⇒ ఈ చిత్రంలో నేను ధీమా అనే పాత్ర పోషించాను. తనకు నోమోఫోబియా. అంటే ధీమా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఆమెకు భయం వేస్తుంది. సోషల్ మీడియాకి బానిస అయిన అమ్మాయి. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో నయనతారగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఓ ప్రాబ్లమ్ వచ్చి, నయనతారగారికి ఫోన్ చేయగా, ఆమె మంచి సలహా ఇచ్చారు... చక్కగా గైడ్ చేశారు.
⇒ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కథ 2040లో జరిగినా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే... ఇప్పుడు కూడా అందరూ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాను ఎక్కువగానే వినియోగిస్తున్నారు. నెగటివ్ ట్రోల్స్ చేసేవారు నెగటివ్‌గా థింక్ చేస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి వాళ్ల జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్నీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ఏమో... భవిష్యత్‌లో లవ్‌ను ఇన్సూరెన్స్ చేసే చాన్స్ ఉంటే, అలా చేస్తారేమో. నాకైతే పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా యాక్టింగ్‌పైనే ఉంది. ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో... ఒక వ్యక్తితో డేటింగ్ చేసి, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడిగారితో సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా అంగీకరించాను. హిందీలో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి..
Tags : 1