ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స
Breaking News
ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు!
Published on Fri, 04/10/2026 - 00:07
‘ఊరోళ్లంతా చందాలు ఏసుకొని ఈ శివరాత్రికి సతీష్‌కి కాసులు ఈయండి. ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు’ అనే డైలాగ్‌తో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ ఆరంభమైంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రోడక్షన్స్ పై కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వెంకటేశ్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వెంకటేశ్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి... మీకు నచ్చితేనే థియేటర్స్‌కు వెళ్లి మా టీమ్‌ని సపోర్ట్ చేయండి. ‘తిమ్మరాజు పల్లి’కి వస్తే మీ ఊరు, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని గ్యారెంటీ ఇస్తున్నాను’’ అని తెలిపారు.
వి. మునిరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. ఇందులో అంతరించిపోతున్న మన సంస్కృతి, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే భావోద్వేగాలను చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ట్రైలర్‌లో మీరు చూసిన కంటెంట్‌కి మించి సినిమాలో చూస్తారు. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌తో మా సినిమా చూసేందుకు వెళ్లండి’’ అని వేద చెప్పారు. ‘‘మన లైఫ్‌లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి’’ అన్నారు సాయి తేజ్.
Tags : 1