ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
డెకాయిట్ నిర్మాత సుప్రియపై సమంత ప్రశంసలు
Published on Thu, 04/09/2026 - 11:21
సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న డెకాయిట్ సినిమాపై నటి సమంత ఒక పోస్ట్ షేర్ చేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని షానియల్ డియో తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు.
డెకాయిట్ చిత్రం విజయం సాధించాలని నిర్మాత సుప్రియకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. 'డియర్ సుప్రియ డెకాయిట్ చిత్రం కోసం నువ్వు చాలా కష్టపడ్డావ్.. సినిమాపై నీవు చూపే అంకితభావం చాలా గొప్పగా ఉంటుంది. ఈ చిత్రం కోసం నీవు పడిన శ్రమ, నిబద్ధత అన్నీ నేను చాలా దగ్గరగా చూశాను. ఒక నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవాలని దానికి పూర్తి అర్హత నీకుందని నేను నమ్ముతున్నాను. దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉంటాయ్.. ఈ మూవీలో నటించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌కు నా అభినందనలు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలని కోరుకుంటున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.
Tags : 1