బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
ఆమెతో బ్రేకప్.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్
Published on Wed, 04/08/2026 - 16:03
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. కామెడీ కంటే ఎక్కువ ఆ షో హోస్ట్ రష్మితో నడిపిన లవ్‌ట్రాక్ సుధీర్‌ని మరింత ఫేమస్ చేసింది. ఆ ఫేమ్‌లో పలు షోలకు హోస్ట్‌గా చేసే అవకాశం వచ్చింది. అవి కూడా సక్సెస్ కావడంతో సుధీర్‌కు వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన పలు షోలకు హోస్ట్‌గా చేస్తున్నాడు. అందులో ఒకటి సర్కార్ సీజన్ 6. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో 'పాపం ప్రతాప్' మూవీ టీమ్ సందడి చేసింది. ఇందులో సుధీర్ తన బ్రేకప్ స్టోరీని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
14 ఏళ్ల పాటు ప్రేమలో..
సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒకనొక దశలో యాంకర్ రష్మితో ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాళ్లిద్దరు కేవలం షో కోసం మాత్రమే లవ్‌ట్రాక్ నడిపామని చెప్పడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది. అయితే రష్మితో కానీ మరో అమ్మాయితో సుధీర్ 14 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడట. చివరి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్నాడట.
బ్రేకప్.. నెక్లెస్ రోడ్‌పై పరుగెత్తా..
సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్‌లో సుధీర్ బ్రేకప్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘14 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాం. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. విషయం తెలిసి..ఏంటి ఇదంతా అని అడిగితే..‘ ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయకు’ అని చెప్పింది. చాలా బాధపడ్డా. నెక్లెస్ రోడ్డులో పరిగెడుతున్నా, అరుస్తున్నా.. ఏంటేంటో చేసేశా.. అంటూ బ్రేకప్ చెప్పిన రోజు జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ఎమోషల్ అయ్యాడు. పక్కనే ఉన్న కో హోస్ట్ విష్ణు ప్రియ.. సుధీర్‌ని హగ్ చేసుకొని ఓదార్చింది.
Tags : 1