బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
ప్రాణాలు పణంగా పెట్టా.. నన్నెవరూ పట్టించుకోలేదు: ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన
Published on Wed, 04/08/2026 - 15:33
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఈ మధ్య చెప్పి మరీ హిట్ కొడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు సమ్మర్లో 'బైకర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. శర్వానంద్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయలేదు.
పెద్ద ప్రమాదం
కేవలం కథల్ని మాత్రమే నమ్ముకుంటూ ముందుకు వెళ్లాను. జాను మూవీ కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ చేస్తూ పెద్ద ప్రమాదానికి గురయ్యాను. అది కేవలం సినిమా కోసమే చేశాను.. నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇండస్ట్రీలో ఎవరూ స్పందించలేదు. అది చూసి బాధ పడ్డాను. అసలు నాకు ప్రమాదం జరిగిందని కూడా కొందరికి తెలియనే తెలియదు. అంటే నేను అంత తక్కువవాడినా? నేను సరిగా కష్టపడట్లేదా? నా పనైపోయిందా? అని చాలా ఫీలయ్యాను. బైకర్‌తో నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను, నిరూపించుకున్నాను అని శర్వానంద్ తెలిపాడు. ఇది విన్న అభిమానులు శర్వా మనసులో ఇంత బాధ ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా: మృణాల్ ఠాకూర్
Tags : 1