Breaking News

ఆ టెకీది సాహసమా..? నాటకమా..?

Published on Wed, 04/08/2026 - 11:38

కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్‌కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..

కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్‌ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. 

ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర​ అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని  బిజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్‌లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్‌గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. 

ట్రెక్కింగ్‌ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..
ఇలా ట్రెక్కింగ్‌ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవ‌ర‌కూ వెళ్లే మార్గం విష‌యంలో అప్రమ‌త్తంగా ఉండాలి. ఏ చిన్న పొర‌పాటు జ‌రిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్యలు ఉంటాయి. టెక్నాల‌జీపై పూర్తిగా ఆధార‌ప‌డ‌కుండా మాన్యువ‌ల్ మ్యాప్‌ను ఫాలో అవ్వాలి. 

ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్‌లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాహ‌స‌యాత్రకు సిద్ధమైన‌ ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే స‌మ‌యంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు ప‌ట్టి ఉండ‌డం వ‌ల్ల కింద‌కి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.

(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!)

 

Videos

త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ

దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్

ఎక్కడ దాక్కున్నావ్.. బయటకు రా! రాధాకృష్ణకు పోతిన మహేష్ వార్నింగ్

జగన్ విధానం కాదనడానికి నువ్వెవడివి, బుడమేరు పొంగినప్పుడు హై కోర్ట్ 5 రోజులు సెలవు

ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ! కోమా లో కొత్త సుప్రీం లీడర్...

అందుకే బన్నీ గ్రేట్ అంటున్న టాలీవుడ్

లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!

YSRCP నేతలతో వైఎస్ జగన్ @తాడేపల్లి

అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు

భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..

Photos

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)