Breaking News

ఈ–కామర్స్ @ 250 బిలియన్‌ డాలర్లు!

Published on Wed, 04/08/2026 - 02:02

న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్‌ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. జెన్‌ జెడ్‌ షాపర్స్, క్విక్‌ కామర్స్‌ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్‌ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్‌ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్‌లైన్‌ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్‌ జెడ్‌ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.

దేశీయంగా ప్రజల షాపింగ్‌ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్‌ కీలక దశలో ఉందని గూగుల్‌ ఇండియా ఎండీ (కనెక్టెడ్‌ కన్జూమర్‌ కామర్స్‌) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్‌ శకం వైపు మార్కెట్‌ మళ్లుతోందని డెలాయిట్‌ దక్షిణాసియా పార్ట్‌నర్‌ ఆనంద్‌ రామనాథన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ జనులైన జెన్‌ జెడ్‌ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్‌ కూడా అందించే జనరేటివ్‌ కామర్స్‌ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. 

మరిన్ని కీలకాంశాలు.. 
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ రాబోయే రోజుల్లో 50 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. 
2030 నాటికి మొత్తం క్విక్‌ కామర్స్‌ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్‌లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్‌ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి.  

క్రియేటర్‌ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్‌ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్‌ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్‌ స్టోర్‌ఫ్రంట్‌ ద్వారా జరుగుతుంది. లైవ్‌ కామర్స్‌ 8 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెరుగుతుంది.  
పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్‌ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్‌ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది.  

Videos

రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్

బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..

ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం

డ్రంక్ అండ్ డ్రైవ్ బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

కాల్పుల విరమణ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..

బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)