Breaking News

కేరళ దేవాలయాలకు అనంత్ అంబానీ భూరి విరాళం

Published on Tue, 04/07/2026 - 13:04

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భారీ విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి, గజరాజుల సంరక్షణకు సంబంధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు పెద్దపీట

ఇటీవల తలపరంబలోని చారిత్రక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.12 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అత్యంత పురాతనమైన, పురావస్తు ప్రాధాన్యత కలిగిన తూర్పు గోపురాన్ని పునరుద్ధరించడానికి ఈ నిధులను ప్రధానంగా వెచ్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయి. తక్షణ విరాళం కింద ఆలయ నిర్వహణ కమిటీకి రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.

ఏనుగుల సంరక్షణ కోసం..

అంతకుముందు, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ స్వామివారికి రూ.3 కోట్ల విరాళాన్ని సమర్పించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల సంక్షేమం కోసం వినూత్న ప్రణాళికలను ప్రకటించారు.

  • ఏనుగుల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం.

  • ఏనుగులను గొలుసులతో కట్టేయకుండా స్వేచ్ఛగా తిరిగేలా ఆధునిక వసతి గృహాల ఏర్పాటు.

  • ఏనుగులకు గౌరవప్రదమైన, శాస్త్రీయమైన సంరక్షణ అందించడానికి అవసరమైన సాంకేతిక మద్దతు.

‘భారతీయ ఆధ్యాత్మిక ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, కరుణ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే జీవన కేంద్రాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మన సంప్రదాయంలో భాగమైన మూగజీవాలకు అత్యుత్తమ వైద్యం, గౌరవం అందించడమే మా లక్ష్యం’ అని అనంత్ అంబానీ అ‍న్నారు.

ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Videos

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత

ఇక గ్యాస్ సిలెండర్ ధర 4000 రూపాయల పైమాటే

రేవంత్ సర్కార్‎పై IASల అసహనం

పెళ్లి పీటలు ఎక్కనున్న అనుపమ?

మహిళలని చూడకుండా... దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..

కూటమి ప్రభుత్వం వేస్ట్.. రాజీనామాకు రెడీ

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)