శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
Breaking News
ఇకపై నేను సింగిలే: హీరోయిన్
Published on Tue, 04/07/2026 - 07:14
సంచలన పాన్ ఇండియా కథానాయికల్లో నటి శ్రుతి హాసన్ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరిస్తూన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ భామ. తరచూ తన ఫొటోలు, సంచలన విషయాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంలోనూ నెటిజన్లకు గట్టిగానే పని చెబుతుంటారు. ముఖ్యంగా తనకు సంబంధంచిన ప్రేమ వ్యవహారాలను చాలా బహిరంగంగా వెల్లడిస్తుంటారు. అలా ప్రేమ ,పెళ్లిపై అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తం చేస్తారు.
గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించి, అతనితో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్గా మారారు. అయితే ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దీంతో అతని ఫొటోలను ఇన్ స్ట్రాగామ్ నుంచి తొలగించేశారు. కాగా ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దష్టి సారిస్తున్న శ్రుతి హాసన్ తన బ్రేకప్ లో గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమించానని చెప్పారు. అయితే అవన్నీ గాయాలతోనే ముగిశాయి అన్నారు.దాంతో ప్రశాంతత బాట పట్టినట్లు చెప్పారు. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తాను సింగిలే అని నటి శ్రుతి హాసన్ చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Tags : 1