Breaking News

25 లక్షల టన్నుల యూరియా దిగుమతికి రంగం సిద్ధం

Published on Mon, 04/06/2026 - 15:49

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు అయిన భారతదేశం సుమారు 2.5 మిలియన్ (25 లక్షల) టన్నుల యూరియాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

టెండర్ల జారీ

ప్రభుత్వ పక్షాన ఎరువుల కొనుగోళ్లు జరిపే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్‌) ఇటీవల భారీ అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల యూరియాను పశ్చిమ తీర నౌకాశ్రయాల ద్వారా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన మొత్తాన్ని తూర్పు తీర ప్రాంతాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎరువుల రవాణా నౌకలు జూన్ 14వ తేదీ నాటికి సంబంధిత ఓడరేవుల నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. టెండర్ల ఆఫర్ల సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా, ఇవి ఏప్రిల్ 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

భారతదేశ యూరియా ఉత్పత్తి ప్రధానంగా సహజ వాయువుపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా వినియోగించే సహజ వాయువులో మెజారిటీ భాగం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హార్మూజ్‌ జలసంధి వద్ద రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎల్‌ఎన్‌జీ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో గత నెలలో దేశంలోని కొన్ని కీలక ఎరువుల ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఖరీఫ్ సన్నద్ధత - నిల్వల వివరాలు

జూన్-సెప్టెంబర్ వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ టన్నుల ఎరువులు అవసరమని ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వ 18 మిలియన్ టన్నులుగా ఉంది. మిగిలిన 21 మిలియన్ టన్నులను దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)