నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్
Breaking News
హగ్ చేసుకున్న యంగ్ హీరోపై నయన్ కామెంట్
Published on Mon, 04/06/2026 - 06:50
నయనతార హీరోయిన్‌గా.. కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త మూవీ 'హాయ్'.. డాడా సినిమాతో కవిన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఏకంగా నయన్‌తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈ కొత్త చిత్రాన్ని జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడిగా విష్ణు ఎడవన్ చాలా సినిమాలకు పనిచేశారు. అయితే, తొలిసారి దర్శకుడిగా హాయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు విష్ణు ఎడవన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇంతకు ముందు నయనతార నిర్మాతగా కవిన్ హీరోగా ఊర్‌కురువి అనే చిత్రం నిర్మించాల్సి ఉందన్నారు. అప్పుడే నయనతారకు కవిన్ తెలుసన్నారు. ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదనీ, ఇప్పుడు నయనతార,కవిన్ నటిస్తున్న హాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఈ చిత్రం తొలి రోజు షూటింగ్‌లో నయనతారను కవిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే నయనతారను కౌగిలించుకోవడానికి కవిన్ సంకోశించారన్నారు. దీంతో ఇంతకు ముందు ఎవరినీ కౌగిలించుకోలేదా? అని ఆమె కవిన్‌ను సరదాగా ఆట పట్టించారన్నారు. ఇలా నయనతార సెట్‌లో ఉంటే జాలీగా ఉంటారని చెప్పారు. కాగా హాయ్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. నయనతార నటించిన చిత్రాలు ఇటీవల తెరపైకి రాకున్నా, త్వరలో మలయాళంలో ముమ్ముట్టి, మోహన్‌లాల్‌లతో కలిసి నటించిన పెట్రియట్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రం చేస్తున్న నయనతార హిందీలో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఒక చిత్రాన్ని కమిట్ అయ్యారు. ఇకపోతే తమిళంలో మన్నాంగట్టి, రాకాయి చిత్రాలు చేతిలో ఉన్నాయి. మలయాళంలో యశ్‌తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.ఇలా పలు భాషల్లో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన ఎల్‌ఐకే చిత్రం ఈ నెల 10న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
Tags : 1