ఈ సినిమా కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటుంది: ‘దిల్‌’ రాజు

Published on Mon, 04/06/2026 - 00:13

‘‘ఒక అప్లికేషన్‌ (యాప్‌) బ్యాక్‌డ్రాప్‌తో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమా తీశారు. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. ప్రదీప్‌ హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విఘ్నేష్‌ శివన్‌ డిఫరెంట్‌ కథలతో సినిమాలు చేస్తారు. ఈ ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ‘దిల్‌’ రాజు చెప్పారు. ప్రదీప్‌ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.

శ్రీ పద్మినీ సినిమాస్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నిర్మాత ‘దిల్‌’ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ తెలుగు వెర్షన్‌ చూశాను... చాలా ఎంజాయ్‌ చేశాను. 2040లో మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడతామో ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు’’ అని చెప్పారు. ‘‘మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం... ఇలా అన్నింటికీ ఫోన్‌ పైనే ఆధారపడుతున్నాం.

మనుషుల కంటే మిషన్స్‌పైనే నమ్మకం పెరుగుతోంది. మిషనే పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక అప్లికేషన్‌ మనకి సరైన పార్ట్‌నర్‌ ఎవరో చెబితే? దాన్ని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు ప్రదీప్‌ రంగనాథన్‌. ‘‘ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న ధీమా పాత్ర చేశాను’’ అన్నారు కృతీ శెట్టి. ‘‘మంచి కాన్సెప్ట్‌తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ఇది’’ అన్నారు విఘ్నేష్‌ శివన్‌. డిస్ట్రిబ్యూటర్‌ శివప్రసాద్, నిర్మాత హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)